సాయంత్రం నితిన్ ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్

26 Jul, 2020 11:32 IST|Sakshi

కొత్త పెళ్లికొడుకు నితిన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం "రంగ్‌దే". 'మ‌హాన‌టి' కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా నితిన్ ఐదు రోజుల పెళ్లిలో ఇప్ప‌టికే నిశ్చితార్థం, మెహందీ కార్య‌క్ర‌మం జ‌రిగాయి. నేడు మ‌రో కీల‌క‌ ఘ‌ట్టం ఆవిష్కృతం కానుంది. వేద మంత్రాల సాక్షిగా షాలిని మెడ‌లో ఆయ‌న‌ మూడు ముళ్లు వేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అభిమానుల‌కు 'రంగ్‌దే' టీమ్ గుర్తుండిపోయే బ‌హుమ‌తిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. (పెళ్లి సందడి షురూ)

"నితిన్ అభిమానుల‌కు, సినీ ప్రేమికుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా నేడు సాయంత్రం 4.05 నిమిషాల‌కు పెళ్లి గిఫ్ట్‌ను రివీల్ చేయ‌నున్నాం" అని ప్ర‌క‌టించారు. దీంతో పండ‌గ చేసుకుంటున్న నితిన్ అభిమానులు సాయంత్రం ఎప్పుడ‌వుతుందా అని క్ష‌ణానికొక‌సారి గ‌డియారం వంక చూస్తున్నారు. మ‌రోవైపు ఈ గిఫ్ట్ ఏమ‌య్యుంటుందా అని కొంద‌రు లెక్క‌లు వేస్తుంటే, ప‌క్కాగా ట్రైల‌ర్ అయ్యుంటుంద‌ని ఆయ‌న అభిమాన గ‌ణం అంచ‌నా వేస్తోంది. 

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు