ఎంత సక్కగున్నావే.. రష్మిక క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ నెట్టింట వైరల్‌

3 Jul, 2021 23:15 IST|Sakshi

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా క‌రోనాతో ప్రజలు సహజీవనం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మన జీవన విధానాల్లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే శానిటైజర్ల వాడకం, మాస్క్‌ల వినియోగం, భౌతిక దూరం పాటించడం లాంటివి దినచర్యల్లో ఒకటిగా నిలిచిపోయాయి. ప్రత్యేకంగా మాస్క్ అనేది తప్పనిసరిగా మారిందనే చెప్పాలి. ఏది మ‌ర‌చిపోయిన ప‌ర్లేదు కాని మాస్క్ మాత్రం మ‌రిచిపోవ‌ద్దు.

ఇక తారల విషయానికొస్తే వారి ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల నటి రష్మిక ఓ ప్రదేశానికి వెళ్లారు. కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఈ ముద్దు గుమ్మ కొన్ని సెకన్ల తర్వాత మాస్క్ పెట్టుకోలేదన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే వెనక్కి వెళ్లి మాస్క్ పెట్టేసుకుంది. ప్రధానంగా మాస్క్‌ లేదని రష్మిక క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి హల్‌ చల్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లోను సినిమాలు చేస్తుంది.

A post shared by Viral Bhayani (@viralbhayani)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు