ఇటలీలో విలన్లను చేజ్‌ చేస్తున్న రవితేజ‌

25 Mar, 2021 08:04 IST|Sakshi

ఇటలీ రోడ్లపై విలన్లను చేజ్‌ చేస్తున్నారు హీరో రవితేజ. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఖిలాడి’. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో డింపుల్‌ హయతి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్‌ , ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రలు చేస్తున్నారు.

ఇటీవల ఇటలీలో ఈ సినిమా షూటింగ్‌ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో రవితేజ, డింపుల్‌ హయతి కాంబినేషన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం యాక్షన్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేస్తున్నారు. ఈ నెలాఖరున ఇటలీ షెడ్యూల్‌ పూర్తవుతుంది. మే 28న ‘ఖిలాడి’ చిత్రం విడుదల కానుంది. 

చదవండి: మార్చి 26 న ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ విడుదల‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు