కమెడియన్‌ కూతురి నిశ్చితార్థంలో తారల సందడి

16 Feb, 2021 14:33 IST|Sakshi

కమెడియన్‌ రఘుబాబు కూతురు నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే కదా!. ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. క్రాక్‌ హీరో రవితేజ, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌, గోపీచంద్‌, డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు, కమెడియన్‌ బ్రహ్మానందం, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, అనసూయ భరద్వాజ్‌, ప్రకాశ్‌రాజ్‌, ఉదయభాను, బ్రహ్మాజీ సహా పలువురు తారలు ఈ ఎంగేజ్‌మెంట్‌కు విచ్చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇక రఘుబాబు సినిమాల విషయానికొస్తే... కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వించగల ఘనుడాయన. కామెడీ టైమింగ్‌, డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే టాలెంట్‌తో తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. పాత్ర డిమాండ్‌ మేరకు కొన్నిసార్లు విలనిజం ఉన్న పాత్రల్లోనూ నటించి మెప్పించాడు. ఈ మధ్యే వచ్చిన జాంబీరెడ్డిలోనూ కనిపించిన రఘుబాబు ప్రస్తుతం ఏ1 ఎక్స్‌ప్రెస్‌, సన్‌ ఆఫ్‌ ఇండియా, గాలి సంపత్‌ సినిమాల్లో నటిస్తున్నాడు.

చదవండి: నెట్టింట్లో సినీతారలు: స్టైల్‌గా ల్యాండైన లైగర్‌

అవసరమైతే వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు