ఫీమేల్ పోలీస్‌ ఆఫిసర్‌ లీడ్‌లో రోహిత్‌ శెట్టి కాప్‌ యూనివర్స్‌ చిత్రం..

16 Nov, 2021 16:30 IST|Sakshi

Rohith Shetty's Cop Universe Movie With A Female Officer: బాలీవుడ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి యాక్షన్‌ సినిమాలకు పెట్టింది పేరు. ఇటీవల విడుదలైన ఆయన తాజా చిత్రం 'సూర్యవంశీ' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అందులో సూపర్‌ స్టార్‌ అక్షయ్ కుమార్‌ను ఎంత పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫిసర్‌గా చూపించారో తెలిసిందే. మరీ అలాంటి పాత్రలో హీరోయిన్‌ను చూపిస్తే. అవును, అలాంటి  రోల్‌లో హీరోయిన్‌ పెట్టి సినిమా తీయాలనుంది అంటున్నారు డైరెక్టర్‌ రోహిత్ శెట్టి.
 

దర్శకుడు రోహిత్‌ శెట్టి ఓ ఇంటర్వ్యూలో తాను తీయబోయే కొత్త చిత్రం గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఇంతకుముందు అతని సినిమాల్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్‌తో ప్రధాన పాత్రలో చేయించలేదని, తన విధానంలో స్త్రీ ప్రధాన పాత్రలో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించానని తెలిపారు. అయితే భవిష్యత్తులో అలాంటి సినిమా ఒకటి ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసుకు భార్య, గర్ల్‌ఫ్రెండ్‌ కంటే ఎక్కువగా మహిళా పోలీసు పాత్ర ఉంటుందన్నారు. అంటే తాను తీసే తర్వాతి కాప్ యూనివర్స్‌ చిత్రం పవర్‌ఫుల్ ఫీమేల్‌ పోలీసు అధికారి పాత్రలో ఉండవచ్చని ఊహించవచ్చు.

ఒకవేళ అదే జరిగితే రోహిత్‌ శెట్టి కాప్ యూనివర్స్‌లో చేసే హీరోయిన్‌ యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేస్తుందన‍్నమాట. రొమాన‍్స్‌కు బదులు భారీ ఫైటింగ్‌లు, చేజింగ్‌లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ కాప్‌ యూనివర్స్‌ నాలుగో సినిమాలో చేసే హీరోయిన్ ఎవరో వేచి చూడాలి. మరోవైపు సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌, కత్రీనా కైఫ్‌ ప్రధానపాత్రలో నటించిన సూర్యవంశీ ఆదివారం వరకు రూ. 151.23 కోట్లను వసూలు చేసింది. అయితే 'సూర్యవంశీ' బ్లాక్‌బస్టర్‌ విజయం ఇంకా ముగిసిపోలేదని డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి అన‍్నారు. ఈ సినిమా విడుదల 19 నెలల కఠినమైన యుద్ధం అని, తాను అతని బృందం కరోనా, దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో సాగిన పోరాట ఫలితమన్నారు. 

మరిన్ని వార్తలు