RRR Movie: ఎత్తర జెండా సాంగ్‌ రిలీజయ్యేది ఎప్పుడంటే? | Sakshi
Sakshi News home page

RRR Movie: ఎత్తర జెండా అంటున్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ఆలియా

Published Thu, Mar 10 2022 8:02 PM

RRR Celebration Anthem Song Out On March 14 - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 25న విడుదలవుతోంది. అప్పుడే ఈ సినిమా కోసం కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టారు ఫ్యాన్స్‌. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చింది.

ఈ సినిమా నుంచి ఎత్తర జెండా అనే సెలబ్రేషన్‌ యాంథమ్‌ను మార్చి 14న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్‌. ఈమేరకు రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో తారక్‌, చెర్రీ, ఆలియా డ్యాన్స్‌కు సై అన్నట్లు కనిపిస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌ ఎన్నో రికార్డులను బద్ధలు కొట్టిన నేపథ్యంలో ఈ యాంథమ్‌ సాంగ్‌ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

Advertisement
Advertisement