Rajamouli RRR Movie: Is RRR Movie Going To Premiere On OTT From May 20th Deets Inside - Sakshi
Sakshi News home page

RRR-OTT Update: ఈ నెలలోనే ఓటీటీకి ఆర్‌ఆర్‌ఆర్‌, ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్‌!

Published Tue, May 3 2022 4:35 PM

RRR Movie: Is RRR Movie Going To Premiere On OTT From May 20th - Sakshi

RRR Movie Going to Premiere On OTT In This Month: జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఎస్‌ఎస్‌ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో జక్కన ఈ సినిమాను రూపొందించాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కోమురం భీంగా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామారాజుగా కనిపించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. మొత్తం ఈ సినిమా రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. 

చదవండి: ఈ సినిమాను మహేశ్‌ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం అదే: డైరెక్టర్‌ పరశురామ్‌

అయితే విడుదలైప్పటీ నుంచి ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌పై జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఎక్కడ చూసినా ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ రిలీజ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు డిజిటల్‌ ప్రేక్షకులు. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకోగా హిందీ, విదేశీ భాషల వెర్షన్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

చదవండి: ప్రియుడికి రూ.లక్ష విలువైన ఫోన్‌ గిఫ్టిచ్చిన సుజాత

ఇదిలా ఉంటే జూన్‌ 3న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందని మొదట వార్తలు వచ్చాయి. కానీ, ఈ తాజా బజ్‌ ప్రకారం మే 20 నుంచే ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందట. ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌పై ప్రేక్షకుల్లో నెలకొన్న ఆసక్తి నేపథ్యంలో వీలైనంత తొందరగా ఓటీటీకి తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నారని టాక్‌. దీంతో జూన్‌ నెలలో కాకుండా మేలోనే అ మూవీని ఓటీటీకి తీసుకొచ్చేందుకు జీ5, నెటఫ్లీక్స్‌ నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే సదరు ఓటీటీ సంస్థల నుంచి అధికారికి ప్రకటన కూడా రానుందట. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్‌ నుంచి క్లారిటీ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. 

Advertisement
Advertisement