Rubina Dilaik Pregnancy: త్వరలో తల్లి కాబోతున్న బిగ్‌బాస్‌ విన్నర్‌.. వెకేషన్‌లో ఉన్న బ్యూటీ

16 Sep, 2023 11:54 IST|Sakshi

బుల్లితెర నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రుబీనా దిలైక్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చప్పింది. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈమేరకు భర్త అభినవ్‌ శుక్లాతో కలిసి దిగిన అందమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో రుబీనా బేబీ బంప్‌ స్పష్టంగా కనిపిస్తోంది. 'మేమిద్దరం కలిసి ఈ ప్రపంచాన్ని చుట్టేస్తామని డేటింగ్‌లో ఉన్నప్పుడే చెప్పాను. తర్వాత పెళ్లి చేసుకున్నాం.

వెకేషన్‌లో జంట
ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకున్నాం. త్వరలో మా కుటుంబంలోకి చిన్నారి ట్రావెలర్‌ రాబోతోంది' అని క్యాప్షన్‌లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రుబీనా దంపతులు అమెరికాలో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనున్న ఈ జంటకు అభిమానులు, బుల్లితెర సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గతకొంతకాలంగా వస్తున్న రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఎట్టకేలకు నిజం ఒప్పేసుకున్నావ్‌ అని కామెంట్స్‌ చేస్తున్నారు. పెళ్లైన ఐదేళ్ల తర్వాత తొలిసారి గర్భం దాల్చడంతో రుబీనా సంతోషంలో మునిగి తేలుతోంది.

ఎలా మొదలైంది..
అభినవ్‌ శుక్లా.. గణపతి ఉత్సవాల సమయంలో తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడే తొలిసారి రుబీనాను చూసి ఆకర్షితుడయ్యాడు. మొదట వీళ్లు స్నేహితులుగా ఉన్నప్పటికీ కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. 2018 వరకు డేటింగ్‌ చేసిన వీరు తమ ప్రేమను పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు. 2020 సంవత్సరంలో హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో పాల్గొన్న రుబీనా ఆ షో విజేతగా నిలిచింది.

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

చదవండి: గర్భం దాల్చాను.. అమ్మ అబార్షన్‌ చేయించింది.. ప్రియుడితో ఇప్పటికీ టచ్‌లో..

మరిన్ని వార్తలు