మరింత మెరుగ్గా బాలు ఆరోగ్యం

31 Aug, 2020 19:45 IST|Sakshi

సాక్షి, చెన్నై: కోవిడ్‌-19తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటన్నట్లు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ‘బాలసుబ్రహ్మణ్యం పూర్తి స్పృహలోనే ఉన్నారు.. వైద్యానికి స్పందిస్తున్నారు. ఫిజియోథెరపీలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు’ అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  క‌రోనా సోక‌డంతో ఎస్పీ బాలు ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తొలుత ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉన్న‌ప్ప‌టికీ మ‌ధ్య‌లో కాస్త విష‌మించింది. దాంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన కోలుకుంటున్నారని..మనుషులను గుర్తుపడుతున్నారని తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. (చదవండి: బాలుకి కరోనా.. నేను కారణం కాదు: గాయని)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు