బిగ్‌బాస్‌ రన్నర్‌కు సల్మాన్‌ ఖాన్‌ గిఫ్ట్

24 Mar, 2021 09:14 IST|Sakshi

బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే! ఈ మధ్యే పద్నాలుగో సీజన్‌ విజయవంతంగా పూర్తైంది. ఇందులో రుబీనా దిలైక్‌ విజేతగా అవతరించగా సింగర్‌ రాహుల్‌ వైద్య రన్నరప్‌గా నిలిచాడు. అయితే ఈ రన్నరప్‌కు సల్మాన్‌ ఊహించని గిఫ్ట్‌ ఇచ్చాడు. ఈ బైక్‌ను కానుకగా పంపి అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీన్ని అందుకున్న రాహుల్‌ సంతోషాన్ని మాటల్లో చెప్పలేము.

"సల్మాన్‌ ఖాన్‌ ఇచ్చిన బీయింగ్‌ హ్యుమన్‌ ఈ బైక్‌. దీని మీద బయట చక్కర్లు కొడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది.." అంటూ దాని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీనిపై బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ షెఫాలీ బాగా స్పందిస్తూ సల్మాన్‌ సర్‌ గిఫ్ట్‌ ఇచ్చాడంటే అది ఎంతో విలువైనది అని చెప్పుకొచ్చింది. కాగా బీయింగ్‌ హ్యుమన్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన వివరాల ప్రకారం దీని ధర రూ.53,999. దీన్ని చార్జ్ చేయాలంటే సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. బ్లాక్‌ అండ్‌ రెడ్‌ కలర్‌లో ఉన్న ఇది రాహుల్‌కు సరిగ్గా సరిపోయింది.

A post shared by Rahul Vaidya 🇮🇳🎤 (@rahulvaidyarkv)

చదవండి: సల్మాన్‌, రణ్‌దీప్‌ల మధ్య ఉండే స్మోక్‌ ఫైట్‌ హైలైట్‌

గంగవ్వకు పట్టీలు కొనిచ్చిన అఖిల్‌‌‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు