Sakshi News home page

నమ్మకం నిజమైంది

Published Sun, Jul 23 2023 4:32 AM

Samajavaragamana Producer Rajesh Danda Speech About Movie Success - Sakshi

శ్రీ విష్ణు హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేష్‌ దండా నిర్మించిన ఈ సినిమా జూన్‌ 29న విడుదలైంది. తాజాగా ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిందని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

ఈ సందర్భంగా రాజేష్‌ దండా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడే చాలా నవ్వుకున్నాం. ఈ కథలో యూనిక్‌ పాయింట్‌ ఉంది. అందుకే ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘గీత గోవిందం’ వంటి సినిమాల తరహా స్క్రిప్ట్‌ ‘సామజ వరగమన’ అని మేం నమ్మాం. మా నమ్మకం నిజమైంది. ఈ సినిమాను సొంతంగా రిలీజ్‌  చేయడం లాభించింది. ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్‌ చేసే ఆలోచన ఉంది’’ అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement