మెహ్రీన్‌కు ‘మంచి రోజులు వ‌చ్చాయి’..త్వరలోనే అనౌన్స్‌మెంట్‌

20 Jul, 2021 20:46 IST|Sakshi

హీరోయిన్‌ మెహ్రీన్‌కు మంచి రోజులు వచ్చాయి. ఆమెకు మంచి రోజులు రావడం  ఏంటి అనే కదా మీ సందేహం. మరేం లేదండి..రీసెంట్‌గా మెహ్రీన్‌ నటిస్తున్న సినిమాకు ఖరారు చేసిన టైటిల్‌ అది. ప్రస్తుతం ఎఫ్‌3 సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో మెహ్రీన్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఏక్ మినీ కథ' సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదిచుకున్న కుర్ర హీరో సంతోష్‌ శోభన్‌తో మెహ్రీన్‌ జతకట్టింది. తాజాగా ఈ చిత్రానికి  ‘మంచి రోజులు వ‌చ్చాయి’ అనే టైటిట్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మూవీ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది. విడుదల తేదీపై త్వరలోనే ప్రకటన రానుంది. 

నిజ‌జీవిత పాత్ర‌లను స్పూర్తిగా తీసుకుని యూత్‌ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తుంది. ఎస్‌కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ప్రస్తుతం మెహ్రీన్‌ చేతిలో ఎఫ్‌3 తప్పా పెద్ద సినిమాలు లేవు. మరోవైపు 'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్‌ కొట్టిన సంతోష్‌ చేతిలో నందినీరెడ్డి సినిమాతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం. 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు