Sarkaru Vaari Paata Movie Kalaavathi Lyrical Song Out Now - Sakshi
Sakshi News home page

Kalaavathi Lyrical Song : 'కళావతీ..కుల్లోబొడిసింది సాలు తీ'.. ఆకట్టుకుంటున్న లిరిక్స్‌

Published Sun, Feb 13 2022 3:37 PM

Sarkaru Vaari Paata Movie Kalaavathi Lyrical Song Out Now - Sakshi

మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ కళావతి పాట విడుదల చేయాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే ఆన్‌లైన్‌లో లీకైన సంగతి తెలిసిందే.

దీంతో ఈ పాటను షెడ్యూల్‌కి ఒకరోజు ముందే మేకర్స్‌ అధికారికంగా విడుదల చేశారు. 'వందో, ఒక వెయ్యో, ఒకలక్షో మెరుపులు దూకినాయా.. ఏందే ఈ మాయ, కమా కమాన్‌ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి' అంటూ సాగే లిరిక్స్‌ ఆకట్టుకుంటాయి. మ్యూజిక్‌ సెన్సెషన్‌ తమన్‌ స్వరాలు అందించిన ఈ పాటను సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. మే 12వ తేదీన ఈ చిత్రం  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement
Advertisement