Hero Suman Comments Shocking Comments On Tollywood Industry In Tirupati - Sakshi
Sakshi News home page

Hero Suman: ఇండస్ట్రీ పెద్ద అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్‌

Published Tue, Jan 4 2022 9:22 AM

Senior Actor Suman Interesting Comments On Tollywood Issue In Tirupati - Sakshi

Hero Suman Interesting Comments On Tollywood Issue: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇండస్ట్రీ పెద్ద ఎవరనే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల సమయం నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్నికల అనంతరం ఎవరూ దీని ఊసే ఎత్తలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని, ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రానన్నారు.

చదవండి: Ram Gopal Varma: ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆర్జీవీ!, ఆ దర్శకుడు ట్వీట్‌ వైరల్‌

కానీ ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటానంటూ చిరు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోహన్‌ బాబు సినీ పరిశ్రమకు బహిరంగ లేఖ రాస్తూ.. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదని వేల కుటుంబాలు, జీవితాలంటూ లేఖలో పేర్కొ‍న్నాడు. దీంతో అప్పటి నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరనేదానిపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ అంశపై పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్‌ నటుటు, హీరో సుమన్‌ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: ఆంటీతో డేటింగ్‌ అంటూ ట్రోల్స్‌, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్‌ హీరో

సోమవారం సాయంత్రం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో సుమన్‌ మాట్లాడుతూ.. ‘నేను సినిమాల్లోకి వచ్చిన  44 ఏళ్లు అవుతుంది. 10 భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించాను. ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా స్వయంకృషితో ఎదిగాను. సినిమా రంగంలో ఐక్యత లేదనడం అవాస్తవం. పరిశ్రమలో కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి సీనియర్లు ఉన్నారు. సమస్యల పరిష్కారానికి వారి సలహా తీసుకోవాలి. సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం సరికాదు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్ల సమస్యను ప్రభుత్వం చర్చించి త్వరలో పరిష్కరించాలి’ అని ఆయన వ్యాఖ్యానించాడు. 

Advertisement
Advertisement