Shah Rukh Khan: పఠాన్‌ డిజాస్టర్‌ అయ్యిందిగా..! నెటిజన్‌ విమర్శకు షారుక్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

5 Jan, 2023 15:40 IST|Sakshi

షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'పఠాన్'. విడుదలకు ముందే ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన 'బేషరమ్ రంగ్‌ రో' సాంగ్‌పై పలువురు రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఇటీవల సెన్సార్‌ బోర్డు సైతం ఈ సినిమాలోని పలు సన్నివేశాలు, పాటల విజువల్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో మార్పులు చేసి మళ్లీ యూ/ఏ సర్టిఫికెట్‌ కోసం రావాలని మూవీ టీంకు సూచించింది. 

చదవండి: ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుడు నేను అనుకుంది చేయలేకపోయా: ప్రభాస్‌

ప్రస్తుతం పఠాన్‌ టీం సెన్సార్‌ సూచన మేరకు చిత్రంలో మార్పులు చేసే పనిలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా షారుక్‌ ట్విటర్‌ వేదికగా ఆస్క్‌ఎస్‌ఆర్‌కే(ASKSRK) లైవ్‌చాట్‌ నిర్వహించాడు. తాను ట్విటర్‌లోకి వచ్చి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ షారుక్‌పై వ్యతిరేకత బయటపెట్టాడు. ‘ఇప్పటికే పఠాన్‌ డిజాస్టర్‌ అయింది. ఇక మీరు రిటైర్‌మెంట్‌ తీసుకోండి’ అంటూ విమర్శించాడు. ‘బెటా పెద్ద వాళ్లతో అలా మాట్లాడకూడదు’ అంటూ సదరు నెటిజన్‌కు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు షారుక్‌. 

చదవండి: సోనూసూద్‌.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్‌ రైల్వే ఆగ్రహం

ఇక మరో నెటిజన్‌ దీపికా గురించి ఒక్క మాటలో చెప్పండి అని అడగ్గా.. ‘తను చాలా స్వీట్‌’ అంటూ సమాధానం ఇచ్చాడు. మరో నెటిజన్‌ ‘సర్‌ మీరు కశ్మీర్‌కు చెందిన ముస్లిం కదా. మీ పేరు వెనుక ఖాన్‌ అని ఎందుకు ఉంది? అని ప్రశ్నించాడు. దీనికి షారుక్‌ ‘ఈ ప్రపంచం మొత్తం నా కుటుంబమే. కుటుంబాన్ని బట్టి మనకు పేరు రాదు. మనం చేసే పనుల బట్టే మనకు పేరు, గౌరవం వస్తుంది. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడకండి’ అని చెప్పాడు. కాగా ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్దార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో జాన్‌ అబ్రహం విలన్‌గా కనిపించనున్నాడు. 

మరిన్ని వార్తలు