గుండెలను హత్తుకుంటున్న ‘సిరివెన్నెల’చివరి పాట

7 Dec, 2021 17:38 IST|Sakshi

ప్రఖ్యాత గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి నవంబర్‌ 30న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1986లో ‘సిరివెన్నెల’చిత్రంతో ప్రారంభమైన ఆయన పాటల ప్రయాణం.. ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో ముగిసింది. నేచురల్‌ స్టార్‌ నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇదే ఆయన రాసిన ఆఖరి పాటని చిత్ర బృందం వెల్లడించింది. ‘సిరివెన్నెల’ అంటూ సాగడం ఈ పాట ప్రత్యేకత.

‘నెలరాజుని… ఇల రాణిని కలిపింది కదా… సిరివెన్నెల’అంటూ సాగే ఈ పాట సిరివెన్నెలను మరోసారి స్మరించుకునేలా చేసింది. ఈ అద్భుత మెలోడీకి మిక్కీ జె. మేయర్‌ స్వరాలు అందించగా, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది.

మరిన్ని వార్తలు