‘సీతారామం’ డైరెక్టర్‌తో సూర్య కొత్త సినిమా!

4 Mar, 2023 14:42 IST|Sakshi

‘సీతారామం’ చిత్రంతో స్టార్‌ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరాడు హను రాఘవపూడి.  దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా గతేడాది ఆగస్ట్‌లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. హను రాఘవపూడి టేకింగ్‌పై విమర్శకుల సైతం ప్రశంసల జల్లు కురిపించారు. ఇంతటి భారీ విజయం తర్వాత హను రాఘవపూడి ఎలాంటి సినిమా తీయబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే పలువురు బడా నిర్మాతలు ఆయన ముందు క్యూ కడుతున్నారు. అయితే ఈ మోస్ట్‌ టాలెంటెడ్‌ దర్శకుడు మాత్రం ఆచి, తూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. తన తర్వాత చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో తీయబోతున్నాడు. తొలుత ఈ చిత్రాన్ని నానితో ప్లాన్‌ చేశారు కానీ అది వర్కౌట్‌ కాలేదు. రామ్ చరణ్ తో తెరకెక్కించాలనుకున్నారట. అదీ సాధ్యం కాలేదు. దీంతో ఈ కథను తమిళ స్టార్‌ హీరో సూర్యకి వినిపించారు. అతను హను రాఘవపూడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు