ఇద్దరికి అభిప్రాయభేదాలు ఎక్కువగా వస్తుంటాయి : ఆద్య, సితార

1 Aug, 2021 01:25 IST|Sakshi

ఫ్రెండ్‌షిప్‌ డే స్పెషల్‌

సితార–ఆద్య... మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘ఎ అండ్‌ ఎస్‌’ పేరుతో యూ ట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నారు. చిన్నారులిద్దరూ యూ ట్యూబ్‌లో చేసే సందడిని లక్షల మంది వీక్షిస్తుంటారు. పండగలప్పుడు, ప్రత్యేక రోజుల్లోనూ, విడిగానూ సితార, ఆద్య చేసే స్పెషల్స్‌ ఫాలోయర్స్‌ని ఆకట్టుకుంటుంటాయి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా చిన్నారులిద్దరూ ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని విశేషాలు ఈ విధంగా..

► మీ ఫ్రెండ్‌షిప్‌ ఎలా స్టార్ట్‌ అయ్యింది?
సితార: మా స్నేహం ‘మహర్షి’ సినిమా ఓపెనింగ్‌ అప్పుడు మొదలైంది. అక్కడ పెద్దగా మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఆద్య వాళ్ల మమ్మీకి మా మమ్మీ ఫోన్‌ చేసి ఆద్యను ఇంటికి పిలిచింది. అలా మళ్లీ కలిశాం. మా ఇద్దరికీ డాల్స్‌ అంటే ఇష్టం. మా వేవ్‌లెంగ్త్‌ మ్యాచ్‌ అయి, ఫ్రెండ్‌షిప్‌ స్ట్రాంగ్‌ అయ్యింది.
ఆద్య: మేమిద్దరం ఒకే స్కూల్‌. అయితే ‘మహర్షి’కి ముందు ఎప్పుడూ సితారతో మాట్లాడలేదు.
ఆ సినిమా అప్పుడు కలిసిన తర్వాతే సితారతో నా ఫ్రెండ్‌షిప్‌ స్టార్ట్‌ అయింది.

► మీకు గొడవలు వస్తుంటాయా? మీ ఒపీనియన్స్‌ సేమ్‌గా ఉంటాయా?
ఇద్దరూ: మా ఇద్దరికీ అభిప్రాయభేదాలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఎన్ని గొడవలొచ్చినా పది నిమిషాలు మాత్రమే.


► మీరు ఏదైనా కొత్తగా చేస్తాం అన్నప్పుడు మీ పేరెంట్స్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుంది?
ఇద్దరూ: యూ ట్యూబ్‌ చానల్‌ స్టార్ట్‌ చేస్తాం అన్నప్పుడు ‘చిన్నపిల్లలు కదా.. ఇప్పుడే ఇంటర్నెట్‌ అవీ వద్దు’ అన్నారు. కానీ ఫైనల్‌గా ఒప్పుకున్నారు.

► మీ ఇద్దరిలో ఒకరికొకరికి నచ్చేదేంటి?
ఆద్య: సితార చాలా ఫన్నీగా ఉంటుంది. షీ ఈజ్‌ వెరీ కేరింగ్‌ అండ్‌ లవింగ్‌.
సితార: షీ ఈజ్‌ లైక్‌ మై బిగ్‌ సిస్టర్‌. తను నా గురించి చాలా కేర్‌ తీసుకుంటుంది.

► మీ ఇద్దరూ కలిసి హాలిడేకి ఎక్కడికైనా వెళ్లారా?
ఇద్దరూ: ఇద్దరం కలిసి వెళ్లిన ఫస్ట్‌ ట్రిప్‌ లండన్‌. అది మా ఇద్దరికీ ఒక మెమొరబుల్‌ హాలిడే. అక్కడ చాలా షాపింగ్‌ చేశాం అండ్‌ బోలెడన్ని మ్యాచింగ్‌ ఐటెమ్స్‌ కొన్నాం.


► యూ ట్యూబ్‌ చానెల్‌లో వీడియోస్‌ ఐడియాలు ఎవరివి?
ఆద్య: ఇద్దరం ఐడియాలు డిస్కస్‌ చేసుకుంటాం.
సితార: కానీ జనరల్‌ నాలెడ్జ్‌కి  సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ అంతా ఆద్య ఇస్తుంటుంది.

హీరో మహేశ్‌బాబు–నమ్రతల కుమార్తె సితార,  దర్శకుడు వంశీ పైడిపల్లి–మాలినిల కుమార్తె ఆద్యతో స్పెషల్‌ చోటే చోటే బాతె ఈరోజు ఉదయం 10.30 గంటలకు... మీ ‘సాక్షి’ టీవీలో...
వెండితెరపై స్నేహ సుమాలల్లిన చిత్రాల తడికన్నులనే తుడిచిన నేస్తమా స్పెషల్‌ ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మీ ‘సాక్షి’ టీవీలో...
వెండితెరపై అలరించిన స్నేహగీతాల పల్లకి స్నేహ గీతం ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మీ ‘సాక్షి’ టీవీలో...
స్నేహితులుగా మారిన వెండితెర గాయకులు... ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న టాలీవుడ్‌ యంగ్‌ సింగర్స్‌ సాహితి, అదితి, శ్రుతీల లైవ్‌ షో ముస్తఫా ముస్తఫా ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు మీ ‘సాక్షి’ టీవీలో...
రియాల్టీ షోలే కాదు రియల్‌ లైఫ్‌లో కూడా ఫ్రెండ్స్‌ అయిన అరియానా, హారికలతో ఫ్రెండ్‌షిప్‌ డే స్పెషల్‌ గరం గరం న్యూస్‌ ఈరోజు రాత్రి 8.30 గంటలకు మీ ‘సాక్షి’ టీవీలో...

మరిన్ని వార్తలు