1979 లోభూమి నాశనం అవుతుందన్నారు..అసలేం జరిగిందంటే..

12 Jul, 2021 01:05 IST|Sakshi
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్‌ రామకృష్ణ

సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్‌ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్కైలాబ్‌’. విశ్వక్‌ కందెరావ్‌ దర్శకత్వంలో డా. రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను హీరోయిన్‌ తమన్నా విడుదల చేశారు. ‘‘1979లో సాగే పీరియాడికల్‌ మూవీ ఇది. అమెరికా స్పేస్‌ స్టేషన్‌ నాసా ప్రయోగించిన స్పేస్‌ స్టేషన్‌ స్కైలాబ్‌ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని అప్పట్లో వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో కరీంనగర్‌ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపిస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: నిత్యామీనన్, కెమెరా: ఆదిత్య జవ్వాది, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి. 

మరిన్ని వార్తలు