పిల్లాడిలా మారిన బన్నీ.. కూతురితో ఎంజాయ్‌!

24 Feb, 2021 20:40 IST|Sakshi

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం‌ కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ మేరకు దుబాయ్‌ వెళ్లిన బన్నీ తన  భార్య స్నేహ, పిల్లలు అయాన్‌, అర్హతో కలిసి అక్కడ సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో దుబాయ్‌లోని ఫేమస్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించాడు. అక్కడ దిగిన కొన్ని చిత్రాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నాడు. అయితే బన్నీ తన గారాల పట్టి అర్హతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇది దుబాయ్‌లోని చిల్డ్రన్స్‌ ప్లే మ్యూజియం ఎయిర్‌ గ్యాలరీలో తీసిన వీడియో. ఇందులో అల్లు అర్జున్‌ కూడా పిల్లాడిలా మారిపోయి కూతురితో ఆడుతూ, ఆడిస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇక ఈ ట్రిప్‌ అనంతరం అల్లు అర్జున్‌ తిరగి పుష్ప షూటింగ్‌ కోసం తమిళనాడు వెళ్లనున్నారు. కాగా అల్లు అర్జున్‌ 'పుష్ప' చిత్రీకరణలో బిజి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్యాన్‌ ఇండియా మూవీగా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్‌ రెడీ అవుతోంది. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తున్నారు. పుష్ప ఆగస్ట్‌ 13న విడుదల కానుంది.
చదవండి: మేకప్‌ మాయ.. కొత్త లుక్‌లో సినీ తారలు

ద్యావుడా, అల్లు అర్జున్‌ను ఇలా వాడుకున్నారా?

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు