‘సారంగ‌ద‌రియా’పై పేర‌డి సాంగ్ వైర‌ల‌య్యా..

8 Apr, 2021 15:09 IST|Sakshi

ఎవ‌రి నోట విన్నా.. ఎవ‌రి ఫోన్‌లోనైనా.. సారంగ‌దరియా పాట మార్మోగుతోంది. యూట్యూబ్‌లో ఇటీవ‌ల వంద మిలియ‌న్ల వ్యూస్ సొంతం చేసుకున్న సారంగ‌దరియా పాటకు పేర‌డి పాట ఒక‌టి ప్ర‌స్తుతం వైర‌ల్‌ అయ్యింది. క‌రోనా టీకాపై సారంగ‌దరియా పాట‌ను రీమేక్ చేస్తూ ఓ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు రాశాడ‌ని తెలుస్తోంది. ఆ పాట‌కు సంబంధించిన లిరిక్స్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దీంతో చాలామంది వాట్స‌ప్ స్టేట‌స్‌లు.. ఫేసుబుక్ పోస్టులు చేస్తున్నారు. 

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్లవి జోడిగా ల‌వ్‌స్టోరీస్ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలోని సారంగ‌దరియా పాట‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ పాట విడుద‌లై  ఎంత హిట్ట‌య్యిందో అంత వివాదాస్ప‌ద‌మైంది. ఆ పాట‌పై ఎన్నో వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌ల ఈ పాట వివాదంపై ఓ షోలో ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల భావోద్వేగానికి గుర‌యిన విష‌యం తెలిసిందే. అవ‌న్నీ ప‌క్కన పెడితే ప్ర‌స్తుతం ట్రెండింగ్ అవుతున్న సారంగ‌దరియా పేర‌డీ సాంగ్ చూడండి.. వినండి. ఓ పాప అద్భుతంగా ఆ పాట‌ను పాడుతూ ఆక‌ట్టుకుంది.

కుడి భుజం మీద టీకా
మీరు వేసుకొనుటకిది మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా..
వారి ఎడమ భుజం మీద టీకా
జర వేసుకొనుడి ఇది మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిట్ టీకా

మక్కుకి కాటన్ మాస్కుల్
లేకున్న బతుకులు ముష్కిల్
చేతికి ప్లాస్టిక్ గ్లౌజుల్
లేకున్న ఉంటయ్ రిస్కుల్
అడుగడుగున కోవిడ్ ఆంక్షల్
పాటిస్తే ఉండవు చావుల్
ఒంట్లో మజిల్సు నొప్పుల్
లేకున్న జ్వరము నిప్పుల్
దివి కంటితో చూడగా తప్పుల్
తుర్రున పోతయిరా ముప్పుల్
టీకా… టీకా… టీకా
ఇది కరోనా కట్టడి మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా

మరిన్ని వార్తలు