సోల్స్‌ మూవీ టీజర్‌ విడుదల

20 Feb, 2022 08:20 IST|Sakshi

మనకు కలిగే ఏ పరిచయమూ కారణం లేకుండా జరగదనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సోల్స్‌’. తినాథ్‌ వర్మ, భావన సాగి  హీరో హీరోయిన్లుగా శ్రావణ్‌ దర్శకత్వంలో విజయలక్ష్మి వేలూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు వెంకటేష్‌ మహా రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ – ‘‘ఇదొక మంచి మ్యూజికల్‌ లవ్‌ స్టోరీ అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘రెండు సోల్స్‌ ప్రయాణం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి ప్రతీక్‌ అబ్యంకర్‌ అండ్‌ ఆనంద్‌ నంబియార్‌ సంగీతం అందించారు.

మరిన్ని వార్తలు