లైంగిక వేధింపుల కేసులో నటుడికి జైలు శిక్ష | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల కేసులో నటుడికి జైలు శిక్ష

Published Sat, Mar 16 2024 12:04 PM

Squid Game Actor OH Yeong Su Punished From Court - Sakshi

‘స్క్విడ్‌ గేమ్‌’.. రెండేళ్ల క్రితం ఏ దేశంలో చూసిన ఈ వెబ్‌ సిరీస్‌ గురించే చర్చ.  ఈ వెబ్‌సిరీస్‌ విడుదలైన 90 దేశాల్లో నెం.1గా కొనసాగింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో తక్కవ సమయంలో ఎక్కువమంది చూసిన వెబ్‌సిరీస్‌గా గుర్తింపు ఉంది. ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో కనిపించిన  'ఓ యోంగ్ సు' మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 2017లో వచ్చిన అభియోగాలపై ఈ 79 ఏళ్ల నటుడికి  దక్షిణ కొరియా కోర్టు శిక్ష విధించింది.

స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌ హిట్‌ కావడంతో ఇటీవలే సీజన్ 2పై ఓ వీడియో ద్వారా మేకర్స్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సీజన్‌లో కీలక పాత్రలో కనిపించిన దక్షిణ కొరియాకు చెందిన ఓ యోంగ్ సు (79) మీద లైంగిక వేధింపుల కేసులో శిక్ష పడింది. సువాన్ జిల్లా కోర్టు సియోంగ్నామ్ శాఖ ఓ యోంగ్ సుకు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. అలాగే సినీ రంగంలో రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించింది. గతంలో కూడా ఆయనపై మరో లైంగిక వేధింపుల కేసు కూడా ఉంది.

2017లో ఓ గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన యోంగ్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ ఓ సరస్సు దాటేందుకు సహాయం కోసం మాత్రమే ఆ మహిళ చేతిని పట్టుకున్నట్లు యోంగ్‌ తెలిపాడు. అందుకు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపాడు. కానీ వాస్తవంగా ఆ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు పూర్తి ఆధారాలు కోర్టుకు దక్కడంతో ఆయనకు శిక్ష ఖరారు అయింది. 50 ఏళ్లుగా ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది.
 

Advertisement
Advertisement