‘ఏజెంట్‌’గా అఖిల్ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది‌

8 Apr, 2021 15:07 IST|Sakshi

సీక్రెట్‌ ఏజెంట్‌గా అఖిల్‌ ఓ మిషన్‌ను టేకప్‌ చేయనున్నారట. అఖిల్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జరిగాయి. గురువారం ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ నేడు అఖిల్‌ బర్త్‌డే సందర్భంగా ‘ఏజెంట్’‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో అఖిల్‌ చేతిలో సిగరేట్‌తోదర్శనమించి అందిరికి షాక్‌ ఇచ్చాడు ఈ లవర్‌ బాయ్‌. 

కాగా ఫుల్‌ యాక్షన్‌ మూవీగా తయారయ్యే  ఈ సినిమాలో ఓ అండర్‌కవర్‌ ఆపరేషన్‌ చేసే ఏజెంట్‌ పాత్రలో అఖిల్‌ కనిపిస్తారట. ఈ సినిమాకు ‘ఏజెంట్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. 

కాగా, ప్రస్తుతం ‌ యంగ్ హీరో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో బిజీగా ఉన్నారు‌. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఏ జిందగీ’ అంటూ ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. 'ఆకాశ‌మంతా ఆనంద‌మై తెల్లారుతోందే నాకోస‌మై..ఆలోచ‌నంతా ఆరాటమై..అన్వేషిస్తోందే'.. ఈ రోజుకై అంటూ సాగే ఈ మెలోడియస్‌ సాంగ్‌ ఆకట్టుకుంటుంది.

చదవండి: 'మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'‌ మెలోడీ సాంగ్‌ విన్నారా?

మరిన్ని వార్తలు