రాజీవ్‌ కనకాలతో షూటింగ్‌లో పాల్గొన్న సురేష్‌ కొండేటి

15 Dec, 2021 18:47 IST|Sakshi

Suresh Kondeti Shares Picture With Rajeev Kanakala In Shooting: తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సురేష్ కొండేటి. 1996లో రాంబంటు సినిమాలో తొలిసారి నటుడిగా కనిపించిన ఆయన తనను నటుడిగా పరిచయం చేసిన డైరెక్టర్‌ బాపు జయంతి రోజున ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.నటుడు రాజీవ్‌ కనకాలతో కలిసి షూట్‌లో పాల్గొన్నారు.ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఇక రాంబంటు సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆయన ఇటీవలె దేవినేని సినిమాలో చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దాసరి గారు తనకు స్ఫూర్తి అని చెప్పే సురేష్ కొండేటి.. దాసరిలా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, డిస్ట్రిబ్యూటర్ ఇలా అన్ని రంగాల్లో ముద్రవేయాలనేది తన కోరిక అని చెబుతూ ఉంటారు.

మరిన్ని వార్తలు