తలకోనలో ఏం జరిగింది?

2 Oct, 2023 01:05 IST|Sakshi
అప్సరా రాణి

అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘తలకోన’. నగేష్‌ నారదాసి దర్శకత్వం వహించారు. స్వప్న శ్రీధర్‌ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్‌ రెడ్డి (చేవెళ్ల) నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది.

‘‘కొంతమంది స్నేహితులతో కలిసి అడవికి వెళతారు హీరోయిన్ . ఎంతమంది వెళ్లారు? ఎందరు తిరిగొచ్చారు? అక్కడ ఏం జరిగింది? అనే అంశాలతో ఈ చిత్ర కథ సాగుతుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సుభాష్‌ ఆనంద్‌ సంగీత దర్శకుడు.

మరిన్ని వార్తలు