మెగాస్టార్‌తో అవకాశం.. తమన్‌ భావోద్వేగం

20 Jan, 2021 13:45 IST|Sakshi

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌

ఆచార్య అనంతరం మలయాళ చిత్రం 'లూసిఫర్‌' రీమేక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటించనున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. సత్యదేవ్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. త్వరలోనే షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు ఇప్పటి వరకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరనే విషయం ఫైనల్‌ కాలేదు. అయితే తాజాగా మెగాస్టార్‌ సినిమాకు సంగీతం అందించే అవకాశాన్ని తమన్‌ కొట్టేశాడు. లూసిఫర్‌కు స్వరాలు సమకూర్చే ఛాన్స్‌ దక్కించుకున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కడం గొప్ప అదృష్టంగా తమన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా చిరంజీవిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.
చదవండి: ఆచార్య: చెర్రీ 'సిద్ధ'మయ్యాడుగా..

‘ప్రతి కంపోజర్‌కు ఇది అతి పెద్ద కల. ఇప్పుడు నా వంతు వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు సమయం వచ్చింది. లూసిఫర్‌ మ్యూజికల్‌ జర్నీ ఇప్పుడు మొదలవుతోంది. మోహన్‌ రాజాకి కృతజ్ఞతలు’ అంటూ తమన్‌ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా లూసిఫర్‌ సినిమా ప్రకటించినప్పటి నుంచి చిరు అభిమానుల్లో హైప్‌ క్రియేట్‌ అవుతోంది. ఈ చిత్రానికి తెలుగులో బైరెడ్డి అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య' మూవీ షూటింగ్‌ వేగంగా జరుపుకోంటుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చందమామ కాజల్‌ అగర్వాల్‌ హీరోయన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ విలన్‌గా కనిపంచనుండగా.. రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో అలరించనన్నాడు. ప్రస్తుతం కోకాపేటలోని 20 ఎకరాల స్థలంలో వేసిన టెంపుల్‌ సెట్‌లో చిరంజీవిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ అనంతరం లూసిఫర్‌ షూటింగ్‌లో చిరు జాయిన్‌ కానున్నాడు.
చదవండి: పవన్‌, క్రిష్‌ సినిమాకు మళ్లీ బ్రేక్‌..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు