Puneet Rajkumar : పునీత్‌ స్ఫూర్తితో.. భారీగా నేత్రదానానికి రిజిస్ట్రేషన్లు

8 Nov, 2021 09:14 IST|Sakshi

Puneet Rajkumar : అర్ధాంతరంగా నిష్క్రమించిన యువ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని అభిమానులు పెద్దసంఖ్యలో సందర్శిస్తుండడంతో బెంగళూరు కంఠీరవ స్టూడియో రద్దీగా మారింది. ఆదివారం సెలవు కావటంతో వేల సంఖ్యలో అభిమానులు దర్శించుకుని స్మరించుకొన్నారు. తెల్లవారుజామున ఐదుగంటల నుంచి అభిమానులు కంఠీరవకు  క్యూ కట్టారు. వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు అనే తేడా లేకుండా తరలివచ్చారు. సుమారు ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటైంది.  

నేడు 11 రోజుల శాస్త్రం  
పునీత్‌ మరణించి సోమవారానికి 11 రోజులు అవుతుంది, ఇంటి వద్ద 11వ రోజు సంస్మరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు అన్నదానం, నేత్రదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.  

నేత్రదానాలు ముమ్మరం   
పునీత్‌ నేత్రదానంతో స్ఫూర్తి పొందిన వందలాది మంది మరణానంతరం నేత్రాలను దానం చేస్తామని ఆస్పత్రులకు రాసి ఇస్తున్నారు. బెంగళూరు నగరంలో రోజూ రెండు వేల మంది నేత్రదానం చేయడానికి ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకొంటున్నారు. ఎమ్మెల్యే రేణుకాచార్య కూడా నేత్రదానం చేస్తానని ప్రకటించారు.

మరిన్ని వార్తలు