‘టాలీవుడ్‌ డ్రగ్స్‌’ కేసు: కెల్విన్‌తో ఫోన్‌కాల్స్‌ మర్మమేమిటి?

16 Sep, 2021 12:18 IST|Sakshi

ముమైత్‌ఖాన్‌ను ఏడుగంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు 

‘టాలీవుడ్‌ డ్రగ్స్‌’ కేసు విచారణకు హాజరైన నటి 

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ డ్రగ్స్‌’ కేసు విచారణలో భాగంగా నటి ముమైత్‌ ఖాన్‌ను బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆమెను ఏడు గంటలకుపైగా విచారించారు. మనీలాండరింగ్‌ కోణంలో ఈ విచారణ సాగింది. ఆమె 2016–17 కు సంబంధించిన తన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను అధికారులకు అందించారు.

డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌తో ఆమె జరిపిన ఫోన్, వాట్సాప్‌ కాల్స్‌పై అధికారులు ఆరా తీశారు. ఈవెం ట్‌ మేనేజర్‌ అయిన కెల్విన్‌ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించిన నేపథ్యంలోనే తనకు పరిచయమయ్యాడని ముమైత్‌ స్పష్టం చేశారు. సినీ రంగానికి సంబంధించిన అంశాలపైనే  అతడిని సంప్రదించానని, అంతేతప్ప తనకు డ్రగ్స్‌ దందాతో సంబం ధాలు లేవని వివరణ ఇచ్చారు. 2015–17 మధ్య తాను పెద్దగా తెలుగు సినిమాల్లో నటించలేదని, ఎక్కువగా ముంబైలోనే ఉన్నానని చెప్పారు.

చదవండి: సినీ ఈవెంట్లకే ఎఫ్‌ క్లబ్‌కు వెళ్లా

పూరీ జగన్నాథ్‌ సినిమాల్లో ఎక్కువగా నటించానని, ఆ సందర్భాల్లోనే ఈవెంట్‌ మేనేజర్‌గా కెలి్వన్‌ కలిసేవాడని వివరించారు. ఎఫ్‌–లాంజ్‌ క్లబ్‌ సహా అనేక పబ్బులకు తాను వెళ్లిన మాట వాస్తవమేనని అంగీకరించిన ముమైత్, వీటిలో ఎక్కడా డ్రగ్స్‌ కొనలేదని, వాడలేదని స్పష్టం చేశారు. ముమైత్‌ విదేశీ పర్యటనలపైనా ఈడీ ప్రశ్నించగా సినిమా షూటింగ్స్, వ్యక్తిగత పర్యటనల నిమిత్తం గోవా, బ్యాంకాక్‌ తదితర ప్రాంతాలకు వెళ్లానని వివరించారు. ‘టాలీవుడ్‌ డ్రగ్స్‌’కేసు విచారణలో భాగంగా శుక్రవారం నటుడు తనీష్‌ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు