గోదావరి నేపథ్యంలో వస్తోన్న లవ్ స్టోరీ.. సాంగ్ రిలీజ్! | Sakshi
Sakshi News home page

Rakshit Atluri: రక్షిత్ అట్లూరి కొత్త సినిమా.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!

Published Thu, Mar 28 2024 9:24 PM

Tollywood hero Rakshith Atluri Latest Movie song Released today - Sakshi

పలాస 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘శశివదనే. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఏజీ ఫిల్మ్ కంపెనీ,  ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'గోదారి అటు వైపో' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ రిలీజ్ చేశారు మేకర్స్.  అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తూ పాడిన ఈ పాటను కిట్టు విస్సా ప్రగడ రాశారు. 

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మూవీ టైటిల్ సాంగ్ శశివదనే, డీజే పిల్లా అనే సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌ ఆడియన్స్‌ ఊహించని స్పందన వచ్చింది. ఈ చిత్రానికి శరవణన్ వాసుదేవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేయనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement