పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలి | Sakshi
Sakshi News home page

పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలి

Published Sun, May 7 2023 3:48 AM

TS It Minister KTR Interesting Comments In Music School Pre-Release Event - Sakshi

‘‘దాదాపు 16 ఏళ్లుగాపాపారావుగారితో నాకు పరిచయం ఉంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా చేశారాయన.పాపారావుగారు ‘మ్యూజిక్‌ స్కూల్‌’ సినిమా తీస్తున్నారని న్యూస్‌పేపర్స్‌లో చూసి తెలుసుకున్నాను. మంచిగా సినిమా చేయాలని కోరుకున్నాను. మ్యూజిక్‌ స్కూల్‌ ట్రైలర్, సాంగ్స్‌ బాగున్నాయి. ఈ సినిమా టైటిల్‌ ‘మ్యూజిక్‌ స్కూల్‌’. కానీ నాకు ఇప్పుడు మ్యూజిక్‌ యూనివర్సిటీ (ఇళయరాజాని ఉద్దేశించి) పక్కన నిలబడే అవకాశం కలిగింది’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు.

శ్రియా శరన్, శర్మాన్  జోషి, షాన్‌ ప్రధాన ప్రాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. ఇళయరాజా సంగీత సారథ్యంలోపాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్‌ కానుంది. తెలుగురాష్ట్రాల్లో ‘దిల్‌’ రాజు, హిందీలో ‘పీవీఆర్‌’ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ‘మ్యూజిక్‌ స్కూల్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ వేడుకలో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఇళయరాజా సంయుక్తంగా ‘మ్యూజిక్‌ స్కూల్‌’ ఆడియోను విడుదల చేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ – ‘‘అయితే ఇంజనీర్‌ కావాలి.. లేకపోతే డాక్టర్‌ కావాలి అంటూ పిల్లల్లో ఆర్ట్స్‌ పట్ల ఉండే సృజనాత్మకను చంపేస్తున్నాం. అలా చేయకూడదు’ అనే అంశంతో ‘మ్యూజిక్‌ స్కూల్‌’ సినిమా తీశామనిపాపారావుగారు చెప్ప్రారు. నా కొడుకుకి 17 ఏళ్లు. ఒక ప్రాట ప్రాడానని, రిలీజ్‌ చేస్తున్నానని మూడు నెలల క్రితం ‘గోల్డెన్‌ ఆర్‌’ అనే ఆల్బమ్‌ కవర్‌ చూపించాడు.

మ్యూజిక్‌లో శిక్షణ తీసుకోనప్పటికీ తన స్కిల్స్, వాయిస్‌ చూసి చాలా సర్‌ప్రైజ్‌ అయ్యాను. ఇలా చాలా మంది పిల్లల్లో ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను మనం తొక్కేయకుండా వారి (పిల్లలు) మనసుకు నచ్చింది చేసేలా ప్రోత్సహించాలంటూ ఈ ‘మ్యూజిక్‌ స్కూల్‌’ తీసినందుకుపాపారావుగారికి అభినందనలు’’ అన్నారు. ‘‘ఇరవయ్యేళ్ల క్రితం ఓ డాక్యుమెంటరీ తీశాను. అది చూసి రమేష్‌ ప్రసాద్‌గారు నాకు జాతీయ అవార్డు వస్తుందన్నారు. ఆయన చెప్పినట్లే ఆరు నెలల తర్వాత ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి అవార్డు వచ్చింది.

ఇళయరాజాగారి వద్దకు ‘మ్యూజిక్‌ స్కూల్‌’ స్క్రిప్ట్‌ తీసుకుని వెళ్లి, ‘ఈ సినిమాలో 11 ప్రాటలు ఉన్నాయి సార్‌’ అనగానే.. పది నిమిషాల్లో ఓకే అన్నారు. ఇళయరాజాగారు ఈ ప్రాజెక్ట్‌లోకి రాకపోయి ఉంటే నేను రాసిన కొన్ని స్క్రిప్ట్స్‌లాగే ఈ కథని కూడా పక్కన పెట్టేవాడిని’’ అన్నారుపాపారావు. ‘‘ఓ సినిమాకు, ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌కు సంబంధం లేదు. ఎంతో ఫ్యాషన్‌ ఉండబట్టిపాపారావుగారు ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. పిల్లలకు, తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ మంచి సందేశంలాంటిది. ‘మ్యూజిక్‌ స్కూల్‌’ను స్కూల్స్‌లోనూ ప్రదర్శించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘దిల్‌’ రాజు.

Advertisement

తప్పక చదవండి

Advertisement