Bigg Boss Fame Vj Sunny Unstoppable Movie Streaming On Amazon Prime OTT - Sakshi
Sakshi News home page

Unstoppable Movie OTT: 'అన్‌స్టాపబుల్' సినిమా.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్

Published Fri, Jul 21 2023 5:54 PM

Unstoppable Movie Streaming In Amazon Prime Video - Sakshi

'పిల్లా నువ్వు లేని జీవితం', 'సీమ శాస్త్రి', 'ఈడోరకం ఆడోరకం' తదితర కామెడీ సినిమాలతో రచయితగా పేరు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్‌టైనర్ 'అన్‌స్టాపబుల్'. 'అన్‌లిమిటెడ్ ఫన్' అనేది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఏ2బీ ఇండియా ప్రొడక్షన్‌లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 

జూన్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన అందుకుంది. IMDBలోనూ 7.8 రేటింగ్ , బుక్ మై షోలో 8.2 రేటింగ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. థియేటర్స్‌లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. చక్కటి హాస్యంతో కూడిన ఈ సినిమాని కుటుంబం మొత్తం కలిసి వీక్షించవచ్చు.

 

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?

Advertisement
Advertisement