Shikaaru:‘మ‌న‌సు దారి త‌ప్పెనే వ‌య‌సు గోడ దూకెనే..’ | Sakshi
Sakshi News home page

Shikaaru:‘మ‌న‌సు దారి త‌ప్పెనే వ‌య‌సు గోడ దూకెనే..’

Published Mon, Feb 7 2022 2:18 PM

Varun Tej  Launches Song From Shikaaru Movie - Sakshi

సాయి ధ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌లో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్, నవకాంత్  ల‌ను హీరోలుగా ప‌రిచ‌యం చేస్తూ శ్రీ‌మ‌తి వాగేశ్వ‌రి(ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ ప‌తాకంపై పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తోన్న చిత్రం `షికారు`. హరి కొలగాని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నుండి సిద్ శ్రీ‌రామ్ ఆల‌పించిన మ‌న‌సు దారి త‌ప్పెనే.. పాట‌ను మెగాహీరో వ‌రుణ్ తేజ్ ఈ రోజు విడుద‌ల చేశారు.

‘మ‌న‌సు దారి త‌ప్పెనే వ‌య‌సు గోడ దూకెనే..అరే అరే అరే హాయ్ అంటే నువ్వు పెద‌విపై న‌వ్వు ఆగ‌నె ఆగ‌దే..ఆగ‌నె ఆగ‌దే..’ అంటూ సాగే ఈ పాట‌కు భాస్క‌ర‌భ‌ట్ల సాహిత్యం అందించారు. ఇక సిద్ శ్రీ‌రామ్ త‌న వాయిస్‌లోని మ్యాజిక్‌ను మ‌రోసారి రిపీట్ చేశారు. శేఖ‌ర్ చంద్ర బాణీలు శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

Advertisement
Advertisement