సంక్రాంతి బరిలో విజయ్‌ దేవరకొండ

27 Sep, 2023 13:57 IST|Sakshi

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోని విజయ్‌ దేవరకొండ దిగబోతున్నారు. గీత గోవిందం లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరుశురామ్‌ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీవెంకటే​శ్వర క్రియేషన్స్‌  బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాలు ఠాకూర్‌ హీరోయిన్‌. వీడీ 13 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం షూటి​ంగ్‌ని జరుపుకుటుంది.

ఇంకా టైటిల్‌ని అయితే ప్రకటించలేదు కానీ.. విడుదల ఎప్పుడో చెప్పేశారు. వీడీ 13 మూవీ 50 శాతం షూటింగ్‌ పూర్తయిందని తెలియజేస్తూ.. సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు.త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. 

ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ మూవీ ఉంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ఎప్పుడో ప్రకటించింది. దీంతో పాటు విక్టరీ వెంకటేశ్‌ ‘సైంధవ్‌’, నాగార్జున ‘నా సామిరంగ’, తేజ సజ్జ ‘హనుమాన్‌’ చిత్రాలు కూడా సంక్రాంతికి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో  ఒకటి రెండు చిత్రాలు తమ విడుదలను వాయిదా వేసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు