థ్రిల్‌ చేసే విధి

29 Sep, 2023 01:17 IST|Sakshi
రోహిత్‌ నందా, ఆనంది

రోహిత్‌ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్‌ రంగనాథన్, శ్రీనాథ్‌ రంగనాథన్‌ రచన, దర్శకత్వంలో ఎస్‌. రంజిత్‌ నిర్మించిన చిత్రం ‘విధి’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో రోహిత్‌ నందా మాట్లాడుతూ– ‘‘విధి’ మాకెంతో స్పెషల్‌ మూవీ. ఆడియో డిస్క్రిప్టివ్‌ టెక్నాలజీతో ఈ సినిమాను చేశాం. దీంతో కంటి చూపు లేనివాళ్లు కూడా మా సినిమాను అనుభూతి చెందగలరు.

ఈ చిత్రానికి శ్రీ చరణ్‌ పాకాలగారు అద్భుతమైన ఆర్‌ఆర్, సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన మూవీ ‘విధి’’ అన్నారు నిర్మాత రంజిత్‌. ‘‘మాకు ఇది తొలి సినిమా. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శ్రీకాంత్, శ్రీనాథ్‌. ‘‘వినోదం మాత్రమే కాదు.. థ్రిల్లింగ్‌ అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు హీరోయిన్‌ ఆనంది. ‘‘ఈ సినిమాలో ట్విస్ట్‌లు బాగుంటాయి’’ అన్నారు శ్రీ చరణ్‌ పాకాల. నటుడు ‘రంగస్థలం’ మహేశ్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు