'కేజీఎఫ్' స్టోరీతో కొత్త సినిమా.. ఆ అవార్డ్‌కి గురిపెట్టిన స్టార్ హీరో

29 Oct, 2023 16:56 IST|Sakshi

పాత్రలకు ప్రాణం పోయడానికి ఎంత కష్టమైన పడే అతి కొద్దిమంది నటుల్లో చియాన్ విక్రమ్‌ ఒకడు. ఇంతకు ముందు 'శివపుత్రుడు', 'ఐ' సినిమాలే ఇందుకు ఉదాహరణ. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఎంత దూరం వెళ్లడానికైనా వెనుకాడడు. అందుకే తన విలక్షణ నటనకు జాతీయ అవార్డు వచ్చింది. తాజాగా మరోసారి జాతీయ అవార్డుకు విక్రమ్‌ గురి పెట్టినట్లు అనిపిస్తుంది. తంగలాన్‌ చిత్రం కోసం ఈయన అంతలా మేకోవర్‌ అయ్యారు. 

(ఇదీ చదవండి: కన్నప్ప’ షూటింగ్‌లో ప్రమాదం.. మంచు విష్ణుకు గాయాలు!)

తాజాగా రిలీజ్ చేసిన 'తంగలాన్' సినిమా పోస్టర్‌లో విక్రమ్.. ముడులు పడిన పొడవైన జుత్తు, నెరిసిన గెడ్డం, వేలాడే గోచీ, చేతిలో మెలికలు తిరిగిన కర్ర, ముఖంలో ఆక్రోశంతో గుర్తు పట్టలేనంతగా మారిపోయి ఈయనెవరో చెప్పుకోండి చూద్దాం అనేలా ఆదివాసిలా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూస్తుంటే సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడో అర్థమవుతోంది. 

పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహన్ హీరోయిన్లు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతమందిస్తున్నాడు. కేజీఎఫ్ బంగారు గనుల నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. కానీ జనవరి 24న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. టీజర్‌ను నవంబర్‌ 1న రిలీజ్ చేయబోతున్నారు.

(ఇదీ చదవండి: వరుణ్ తేజ్​- లావణ్య పెళ్లి షెడ్యూల్‌ ఇదే.. వేడుకలకు ఆమె దూరం)

మరిన్ని వార్తలు