మనవరాళ్లతో కలిసి వంట చేసిన మెగాస్టార్‌

2 Nov, 2020 10:19 IST|Sakshi

లాక్‌డౌన్‌.. అందరికి ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్తా విశ్రాంతి అందించింది. సెలబ్రిటీల నుంచి సాధారణ పౌరుని వరకు ఇంట్లో తమ కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు అవకాశం లభించింది. ఖాళీ సమయం దొరకడంతో తమకు నచ్చిన వ్యాపకాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి వంటింట్లోకి చేరి తనలోని నలభీముడిని ప్రదర్శించిన విషయం గుర్తుండే ఉంటుంది. నోరూరించే ఉప్మా పెసరెట్టు వేసిన ఆయన అనంతరం మరి కొన్ని వంటకాలను చేసి కుటుంబానికి రుచి చూపించారు. తాజాగా మరోసారి కిచెన్‌లోకి వెళ్లిన మెగాస్టార్‌ తన మనవరాళ్లతో కలిసి ఓ స్పెషల్‌ వంటకాన్ని తయారు చేశారు. దాని పేరు ఫేమస్‌ కేఎఫ్‌సీ‌ చికెన్‌. చదవండి: నాగబాబు బర్త్‌డేకు చిరంజీవి భావోద్వేగ ట్వీట్‌

కూతుళ్ల పిల్లలు సంహిత, నివ్రితితో కలిసి కేఎఫ్‌సీ చికెన్‌ వంటకాన్ని చేసిన చిరంజీవి దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీనికి ‘వంట చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. ముఖ్యంగా పక్కన ఇలాంటి అల్లరి పిల్లలు ఉంటే అది మరింత ఆనందంగా ఉంటుంది. ఇక ఈ వంటకం ఎలా ఉందో చుద్దాం..’ అనే క్యాషన్‌తో షేర్‌ చేశారు. ఈ వీడియోలో ముందుగా పిల్లలను ఈ రోజు బోర్‌ కొడుతుంది ఏం చేద్దాం అని అడుగుతారు. దీంతో సంహిత తనకు కేఎఫ్‌సీ‌ చికెన్‌ తినాలని ఉందని చెప్పింది. దీంతో కోవిడ్‌ సమయంలో బయట నుంచి తీసుకురావడం అంత సురక్షితం కాదని, ఇంట్లనే తయారు చేద్దాం అంటూ తనకు పిల్లలు ఇద్దరు సహాయం చేయాలని కోరారు. దీనికి వాళ్లు ఒకే చెప్పడంతో మెగాస్టార్‌ వెంటనే చెఫ్‌గా మారి అద్భుతమైన ఫ్రైడ్‌ చికెన్‌ చేసి పెట్టారు. చదవండి: ‘కరోనా’ నేర్పిన పాఠం ఇదే..

ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిరంజీవి వంటకాన్ని పొగడ్తలతో ముంచెత్తిస్తున్నారు. అటు యాక్టింగ్‌లోనే కాకుండా ఇటు వంటింట్లోనూ చిరంజీవి మెగాస్టార్‌‌ అని ప్రశంసిస్తున్నారు. ‘మా అన్నయ్య వంట చేస్తే నోరూరాల్సిందే’నని కామెంట్‌ చేస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను చేస్తున్నారు. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం మలయాళ బ్లాక్‌ బస్టర్‌ లూసిఫర్‌ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమాను వివి వినాయక్‌ తెరకెక్కిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు