ఆర్డినరీ హీరోలు ఎక్స్‌ట్రార్డినరీగా.. రష్మిక వీడియో సందేశం

25 May, 2021 10:19 IST|Sakshi

'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందన్నా 'గీత గోవిందం'తో యూత్‌ ఫేవరెట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. 'డియర్‌ కామ్రేడ్‌'తో జనాలను మెప్పించిన ఆమె 'సరిలేరు నీకెవ్వరు'తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌, 'భీష్మ'తో బీభత్సమైన ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా కరోనా పరిస్థితుల గురించి వివరిస్తూ రష్మిక సోషల్‌ మీడియా ఖాతాలలో ఒక వీడియో రిలీజ్‌ చేసింది.

ఇంతకీ ఆ వీడియోలో రష్మిక ఏమని మాట్లాడిందంటే.. 'అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేకపోయాం. కోవిడ్‌ వల్ల దైనందిన జీవితాల్లో ఎన్నో ఆకస్మిక మార్పులు సంభవించాయి. గతేడాది నెలకొన్న పరిస్థితులే మళ్లీ రిపీట్‌ అవుతున్నాయని తెలియడానికి నాకు ఇంత సమయం పట్టింది. కానీ ఇలాంటి సమయంలోనే మనం పాజిటివ్‌గా ఉండటం మంచిది. మనం ఈ యుద్ధాన్ని గెలిచేందుకు చాలా దగ్గరలో ఉన్నాం.

ఆర్డినరీ హీరోలు ఎక్స్‌ట్రార్డినరీగా పనిచేస్తున్న వారి కథనాలను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. వాళ్లు చేస్తున్న కార్యక్రమాలు నాలో కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఏ భాష మాట్లాడతాం వంటివి ఏమీ అవసరం లేదు.. ఎలాంటి పనులు చేస్తున్నామనేదే ముఖ్యం. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీ ముఖం మీద చిరునవ్వు తీసుకురావడంతో పాటు ఆ హీరోలకు కృతజ్ఞతలు చెప్పడానికి నేనీ వీడియో చేశాను' అని చెప్పుకొచ్చింది.

చదవండి: హిందీ నేర్చుకునేందుకు తెగ కష్టపడుతున్న రష్మిక

శాండల్‌ వుడ్‌ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు