నటడిగా మరో సినిమా చేయనున్న వినాయక్‌

10 Jun, 2021 08:41 IST|Sakshi

‘ఠాగూర్‌’, ‘ఖైదీ నం. 150’, ‘నేనింతే’వంటి చిత్రాల్లో దర్శకుడు వీవీ వినాయక్‌ నటుడిగా కనిపించారు. అయితే ఇవి పెద్ద నిడివి ఉన్న పాత్రలు కాదు. ఆయన హీరోగా ఆ మధ్య ‘శీనయ్య’ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. ఆ సినిమా గురించి పక్కన పెడితే తాజాగా వినాయక్‌ మలయాళ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు. పవన్‌ కల్యాణ్, రానా హీరోలుగా  ఈ చిత్రానికి సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వీవీ వినాయక్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. లాక్‌డౌన్‌కు ముందు జరిగిన ఈ సినిమా షూటింగ్‌లో వినాయక్‌ పాల్గొన్నారు. మరోవైపు వీవీ వినాయక్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నటించనున్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు