'వ్యూహం' సినిమాపై తీర్పు రేపటికి వాయిదా | Sakshi
Sakshi News home page

Vyuham Movie: 'వ్యూహం'పై తీర్పు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

Published Tue, Jan 30 2024 5:18 PM

Vyuham Movie Hearing Postponed Tomorrow Telangana High Court - Sakshi

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తీసిన 'వ్యూహం' చిత్రంపై తెలంగాణ హైకోర్టులో విచారణ మంగళవారం మరోసారి జరిగింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం చెప్పింది. ఈ చిత్ర విడుదల అంశంపై తాజాగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని చిత్ర యూనిట్‌ న్యాయస్థానాన్ని కోరింది.ఈ నేపథ్యంలో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే థియేటర్లలోకి 10 సినిమాలు.. అదొక్కటే కాస్త స్పెషల్)

వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌తో పాటు పలు రికార్డ్స్‌ను ఇప్పటికే సెన్సార్ బోర్డు కోర్టుకు అందజేసింది. సెన్సార్ బోర్డ్ రికార్డ్స్‌ను పరిశీలించిన తరువాత విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. విడుదల విషయంలో జాప్యం జరిగితే  భారీ నష్టం వస్తుందని 'వ్యూహం' నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ కోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలోనే విచారణ జరుగుతోంది.

'వ్యూహం' సినిమాని అడ్డుకునేందుకు తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత లోకేష్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. లోకేష్‌ పిటిషన్‌తో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది.

(ఇదీ చదవండి: 'యాత్ర-2' నుంచి మరో సాంగ్‌ విడుదల)

Advertisement
Advertisement