హీరోయిన్‌ ప్రణిత భర్త బ్యాక్‌గ్రౌండ్‌, ఆయన వ్యాపారాలు ఏంటంటే..

3 Jun, 2021 14:08 IST|Sakshi

హీరోయిన్‌ ప్రణిత సుభాష్‌ రీసెంట్‌గానే పెళ్లి చేసుకొని మిసెస్‌ ప్రణితగా మారింది. ఏమాత్రం హడావిడి లేకుండా, చాలా సైలెంట్‌గా పెళ్లి విషయాన్ని రివీల్‌ చేసింది. నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తను లాక్‌డౌన్‌లో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చింది. బెంగుళూరులోని తన నివాసంలో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ప్రణిత పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు.. ప్రణిత పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

ఇక  పెళ్లి విషయంపై స్పందించిన ప్రణిత తమది ప్రేమ వివాహమని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నట్లు వివరించింది. అయితే కోవిడ్‌ పరిస్థితుల కారణంగా పెళ్లి తేదీపై సందిగ్ధత నెలకొందని, పెళ్లికి ముందు రోజు వరకు ఇలాంటి పరిస్థితే కొనసాగిందని పేర్కొంది. కోవిడ్‌ దృష్ట్యా ఎక్కవమంది ఆహ్వానించలేకపోయామని, పెద్ద మనసుతో మన్నించాలని కోరుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్‌ చేసింది. ఇక ప్రణిత పెళ్లి ఫోటోలు వైరల్‌ కావడంతో అసలు ప్రణిత పెళ్లి చేసుకుంది ఎవరిని ఆయన ఏం చేస్తుంటారంటూ చాలామంది గూగూల్‌లో సెర్చ్‌ చేయడం మొదలుపెట్టారు.

తాజా సమాచారం ప్రకారం.. ప్రణిత భర్త బెంగుళూరులో హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేసి 2011లో బ్లూ హరిజన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను  ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ బిజెనెస్‌తో పాటు నితిన్‌ రాజుకు మరికొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయని సమాచారాం. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటించిన ప్రణిత అత్తారింటికి దారేది, రభస చిత్రలతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ‘హంగామా-2’,  భుజ్ అనే చిత్రాల్లో  నటిస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల స్వయంగా ఆహారం తయారు చేసి అందిస్తూ అందరి మనసును గెలుచుకున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రణిత.. ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు