Naveen Reddy: సినీ హీరో నవీన్‌ రెడ్డి అరెస్ట్‌

4 Feb, 2023 16:25 IST|Sakshi

సినీ హీరో నవీన్‌ రెడ్డి అట్లూరిని పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఎన్‌ స్క్వేర్‌ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేసిన అతడు సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టాడు. అంతేగాక ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

దీంతో బాధితులు నవీన్‌ రూ.55 కోట్ల మేర మోసం చేశాడంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్‌ తరలించారు. కాగా నవీన్‌ రెడ్డి హీరోగా 'నో బడీ' అనే సినిమా తీసినట్లు తెలుస్తోంది. అతడి స్వస్థలం సూర్యాపేట జిల్లా అని చెబుతున్నారు. 

చదవండి: సడన్‌గా రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్‌ ఫిక్స్‌ చేశారు

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు