సౌకర్యాల కల్పనలో రాజీపడొద్దు | Sakshi
Sakshi News home page

సౌకర్యాల కల్పనలో రాజీపడొద్దు

Published Sun, Mar 26 2023 1:42 AM

డిగ్రీ కళాశాల విద్యార్థినులతో మాట్లాడుతున్న పీఓ అంకిత్‌ - Sakshi

ఏటూరునాగారం: గిరిజన విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో రాజీ పడకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని హెచ్‌ఎంలు, హెచ్‌డబ్ల్యూఓలు, ఇంజనీరింగ్‌ అధికారులను ఐటీడీఏ పీఓ అంకిత్‌ ఆదేశించారు. ఇటీవల ఒగ్లాపూర్‌ నుంచి మండల కేంద్రంలోని రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలను మార్చిన భవనాన్ని పీఓ శనివారం తనిఖీ చేశారు. ప్రతిపాదిత తరగతి గదులు, లేబొరేటరీలు, డార్మెంటరీలు, కార్యాలయ గదులను పరిశీలించి ఫర్నీచర్‌, ఇతర వస్తువులను మార్చడంపై ఆరా తీశారు. తాగునీటి వనరులు, తగినంత టాయిలెట్‌ బ్లాక్‌లు, తదితర సమస్యలపై చర్చించారు. ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ సుజాత తగినంత లేబొరేటరీల చేయడానికి కొన్ని గోడలను కూల్చివేయాలని, అదనపు వాటర్‌ ట్యాంక్‌, కిటికీలకు కొన్ని మరమ్మతులు చేయాలని ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు, కోతులు ప్రవేశించకుండా ప్రహరీపై సోలార్‌ ఫెన్సింగ్‌ కోసం అంచనా వేయాలని ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ హేమలతను పీఓ ఆదేశించారు. అనంతరం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులందరికీ ప్రత్యేక భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి స్థితిగతలు ను అడిగి తెలుసుకున్నారు.

సేవాభావాన్ని అలవర్చుకోవాలి

విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఐటీడీఏ పీఓ అంకిత్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఆర్‌ ఐటీఐ కళాశాలలో ఏటూరునాగారం బీ 39 బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో స్థానిక విద్యార్థులకు క్రీడా సామగ్రి, గొత్తికోయలకు వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ అంకిత్‌ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేయడంతో పాటు గొత్తికోయలకు మందులను పంపిణీ చేశారు. అనంతరం పీఓ మాట్లాడారు. సీఆర్‌పీఎఫ్‌ సివిక్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్రీడా సామగ్రి అందజేయడం అభినందనీయమన్నారు.

ఐటీడీఏ పీఓ అంకిత్‌

Advertisement
Advertisement