నేడు బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు | Sakshi
Sakshi News home page

నేడు బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

Published Fri, Mar 31 2023 1:52 AM

- - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు జిల్లా ప్రధాన కోర్టు ఆవరణలో శుక్రవారం నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా ప్రధాన కోర్టుతో పాటు సీనియర్‌ సివిల్‌ కోర్టు, జూనియర్‌ సివిల్‌ కోర్టులు ఏర్పాటైన తర్వాత మొదటిసారి బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతకుముందు న్యాయవాదులందరూ కలిసి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిని తాత్కాలికంగా ఎన్నుకున్నారు. నేడు అధికారికంగా న్యాయవాదులు బ్యాలెట్‌ పద్ధతి ద్వారా ఎన్నుకోనున్నారు. మొత్తం 50మంది సభ్యులు ఉన్నారు. ఇందులో రెండు ఫ్యానళ్ల నుంచి పోటీ చేయటానికి ఆశావహులు సిద్ధమయ్యారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి కోసం న్యాయవాదులు చల్లూరు మధు, ఎం.రవీందర్‌, ఎదులాపురం శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శులుగా పగడాల అనందరావు, బర్ల మహేందర్‌, కునూరు సురేష్‌కుమార్‌ పోటీ పడుతున్నారు. ఉపాధ్యక్ష పదవి కోసం ఇద్దరు, ప్రధాన కార్యదర్శి పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నట్లు సమాచారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

కేయూ దూర విద్య పీజీ పరీక్షల షెడ్యూల్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, అదిలాబాద్‌ జిల్లాల్లో దూరవిద్య పీజీ కోర్సుల (2022)ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మ్యాథ్స్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఎం, ఎల్‌ఎల్‌ఎం ప్రథమ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 12నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు మల్లారెడ్డి, నరేందర్‌లు తెలిపారు. ఫైనలియర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 13వ తేదీనుంచి జరగనున్నట్లు పేర్కొన్నారు. పీజీ కోర్సుల ప్రథమ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 12, 15, 18, 20, 24 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఫైనలియర్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 13, 17, 19, 21, 25 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు.

అలరించిన స్పిక్‌మేకే

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన స్పిక్‌మేకే కల్చరల్‌ ప్రోగ్రాం అలరించింది. ప్రముఖ సితార్‌ వాయిద్యకారుడు ధృవ్‌బేడీ, తబలా ప్లేయర్‌ మహ్మద్‌ నజీముద్దీన్‌ ఖాద్రీలు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. నిట్‌లోని స్పిక్‌మేకే (సొసైటీ ఫర్‌ ది ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌ అండ్‌ కల్చర్‌ ఎమంగ్స్‌ యూత్‌) యువతకు మన సంస్కృతీ సంప్రదాయాలను, ప్రాచీన కళలకు పునర్‌వైభవం తీసుకువచ్చే వేదికగా ఏర్పాటు చేసినట్లు నిట్‌ రిజిస్ట్రార్‌ గోవర్ధన్‌రావు తెలిపారు. కార్యక్రమంలో డీన్‌ ఫ్యాకల్టీ అఫైర్స్‌ కామేశ్వర్‌రావు, ప్రొఫెసర్‌ వైఎన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నిట్‌తో వేసువియాస్‌

ఎంఓయూ

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌తో యూకేలోని వేసువియాస్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. డైరెక్టర్‌ ఎన్వీ.రమణారావు, వేసువియాస్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ ఇనిషియేటివ్‌ మేనేజర్‌ రాజశ్రీదాస్‌లు పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఎంఓయూ ద్వారా నిట్‌కు చెందిన మెకానికల్‌, బెటలర్జీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ముగ్గురు బీటెక్‌ విద్యార్థినులకు సెకండియర్‌ నుంచి ఫైనలియర్‌ వరకు వేసుమియాస్‌ స్కాలర్‌షిప్‌ ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను అందజేస్తుందని నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ.రమణారావు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ ఉమామహేష్‌, డేవిడ్‌సన్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

1/1

Advertisement
Advertisement