వైభవంగా విజయదశమి | Sakshi
Sakshi News home page

వైభవంగా విజయదశమి

Published Wed, Oct 25 2023 1:42 AM

- - Sakshi

ఏటూరునాగారంలో దహనమవుతున్న రావణుడి ప్రతిమ

ములుగు: జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడుకలను భక్తులు సోమవారం వైభవంగా జరుపుకున్నారు. జమ్మిచెట్ల వద్ద పూజలు చేయడంతో పాటు శమీ మంత్రాన్ని జపించారు. జిల్లా కేంద్రంలోని రామాలయం, శివాలయం, సాయిబాబా ఆలయం, గట్టమ్మ ఆలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో దేవాలయాలు జనంతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని రామాలయం సమీపంలోని జమ్మి చెట్టుకు చింతలపూడి నర్సింహారెడ్డి–శమంత ఆధ్వర్యంలో పూజలు చేశారు. పూజలకు హాజరైన వారికి చింతల పూడి భాస్కర్‌రెడ్డి, ప్రమోద్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ దంపతులు గండ్రకోట శ్రీదేవి సుధీర్‌యాదవ్‌, చిన్న కొండారెడ్డి, ఆవుల ప్రశాంత్‌, జంగిలి కోటేఽశ్వర్‌, దుగ్గిరెడ్డి ఇంద్రసేనారెడ్డి, హరినాథ్‌ గుప్తా, గంగిశెట్టి శ్రీనివాస్‌, ఆనందం జమ్మి ఆకులు అందించారు.

రావణ వధ

ఎల్లప్పుడు ధర్మమే గెలుస్తుందని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సామాజిక, సాహితి, విద్యావేత్త గన్నమరాజు గిరిజా మనోహర్‌ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సాధన పబ్లిక్‌ హైస్కూల్‌ సమీపంలో నిర్వహించిన రావణ వధ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ములుగు ఎస్సైలు వెంకటేశ్వర్‌, రామకృష్ణతో కలిసి రావణుడి ప్రతిమకు నిప్పటించారు. ధర్మ జాగరణ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్‌ మాట్లాడుతూ అధర్మంపై ధర్మం గెలిచిన రోజున దసరా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుంచి సన్మార్గంలో నడిచేలా చూడాలన్నారు. సీఐ రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ సమాజంలో యువత సన్మార్గంలో నడిచేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా నృత్యం చేసిన చిన్నారులను సీఐ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు, ఎడ్ల అనిల్‌ రెడ్డి, అజయ్‌, దిలీప్‌, రవి, వేణు, నరేష్‌, నాగరాజు, గణేష్‌, శ్రీకాంత్‌లను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్‌, రామకృష్ణ, తాజుద్దీన్‌, ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీకాంత్‌ రెడ్డి, రవి, చంద్రారెడ్డి, శ్రీనివాస్‌, రమేష్‌, చింత నిప్పుల భిక్షపతి, పద్మాకర్‌ రెడ్డి, మధు, రవీందర రాజు, రఘు, వెంకయ్య, పిచ్చిరెడ్డి, హరినాథ్‌, ఓదెలు, జనార్ధన్‌, వెంకటరమణారెడ్డి, సునీల్‌ కుమార్‌, భూక్య జంపన్న, సిద్ధ గోపాల్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

దసరా ఉత్సవాల్లో

ఎమ్మెల్యే సీతక్క

ఏటూరునాగారం: మండల కేంద్రంలో సోమవారం జరిగిన దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే సీతక్క హాజరై అందరికీ దసరా శుభాక్షాలు తెలిపారు. రామాలయం నుంచి బయలు దేరిన ర్యాలీలో ఎమ్మెల్యే సీతక్క పాల్గొని కార్యకర్తలతో కలిసి ప్రజలను కలిసి పలకరించారు. అందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దసరా ఉత్సవాలు ఏటూరునాగారంలో ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే రావణవధ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలకు దసరా శుభాకాంక్షలను తెలిపారు.

జమ్మిచెట్టుకు పూజలు

ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో ములుగులో రావణ వధ

జమ్మిచెట్టుకు పూజలు చేస్తున్న భక్తులు
1/3

జమ్మిచెట్టుకు పూజలు చేస్తున్న భక్తులు

రావణ వధ కార్యక్రమంలో ..
2/3

రావణ వధ కార్యక్రమంలో ..

దసరా ఉత్సవాల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే
3/3

దసరా ఉత్సవాల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

Advertisement
Advertisement