విశ్వరూప మహాసభను విజయవంతం చేయండి | Sakshi
Sakshi News home page

విశ్వరూప మహాసభను విజయవంతం చేయండి

Published Thu, Nov 9 2023 1:52 AM

- - Sakshi

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: హైదరాబాద్‌లో ఈ నెల 11న నిర్వహించనున్న మాదిగల విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జ్‌ శంకర్‌ అన్నారు. మండల కేంద్రంలో ఆయన బుధవారం విశ్వరూప మహాసభ పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. ఈ మహాసభకు మాదిగలు, మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ పుల్లూరి కరుణాకర్‌, మండల కన్వీనర్‌ గజ్జెల ప్రసాద్‌, ఎంఎస్‌పీ మండల ఇన్‌చార్జ్‌ గజ్జెల ప్రసాద్‌, నాయకులు పుల్లూరి నరేందర్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement