అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు | Sakshi
Sakshi News home page

అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు

Published Thu, Nov 9 2023 1:52 AM

- - Sakshi

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న తెలుగు సజ్జెక్ట్‌ అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జె.చిన్న బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు పీజీలో జనరల్‌, ఓబీసీ వారు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోగా కళాశాలలో నేరుగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. పీహెచ్‌డీ, నెట్‌, సెట్‌ అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. మరిన్ని వివరాలకు సెల్‌ 9866560840 నంబర్‌లో సంప్రదించాలని వివరించారు.

ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్‌ : హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ 3, 5వ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రిన్సిపాల్‌ బన్న అయిలయ్య బుధవారం తెలిపారు. వివిధ విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు అన్ని విభాగాల అఽధిపతులతో చర్చించామని, ఈనెల 9 నుంచి నిర్వహించాల్సిన ఆయా సెమిస్టర్‌ పరీక్షలను ఈనెల 14 నుంచి నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. విద్యార్థులు గమనించాలని కోరారు.

ఉత్సాహంగా

బాక్సింగ్‌ ఎంపిక పోటీలు

హన్మకొండ : హనుమకొండ జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సీనియర్స్‌ పురుషుల బాక్సింగ్‌ ఎంపిక పోటీలు బుదవారం ఉత్సాహంగా జరిగాయి. హనుమకొండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని డీఎస్‌ఏ బాక్సింగ్‌హాల్‌లో నిర్వహించిన ఎంపికలను సీనియర్‌ బాక్సర్‌ డాక్టర్‌ చాడ సుభాష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంబించారు. పోటీలకు జిల్లా నుంచి 60 మంది క్రీడాకారులు హాజరైనట్లు నిర్వహణ కార్యదర్శి వై.సురేందర్‌ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌న్‌ జిల్లా అధ్యక్షుడు బి.రవీందర్‌కుమార్‌, ట్రెజరర్‌ బి.సర్వేశ్వర్‌, కార్యదర్శి కమలాకర్‌, ఖేలో ఇండియా బాక్సింగ్‌ కోచ్‌ దేవరకొండ ప్రభుదాస్‌, సీనియర్‌ బాక్సర్లు సదానందం, గిరి, గిరిధర్‌, కృష్ణమూర్తి, సుధాకర్‌, అభినవ్‌, రాజేందర్‌, కృష్ణ పాల్గొన్నారు.

‘సౌత్‌జోన్‌’ పోటీలకు

కేయూ జట్టు ఎంపిక

కేయూ క్యాంపస్‌ : కాకినాడలోని జేఎన్‌టీయూలో ఈనెల 9 నుంచి 12 వరకు జరుగనున్న సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ఆచార్య పి.శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. నానుగొప్పుల అజయ్‌కుమార్‌ (వాగ్దేవి కళాశాల, హనుమకొండ), చింతు శివాజీ, కె.యువరాజు, మధుపవన్‌ (కేడీసీ, హనుమకొండ), కె.గాంధీ, భూక్యా ఆజాద్‌, రమావత్‌ అనిల్‌కుమార్‌, అజ్మీరా అఖిల్‌ (ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల ఖమ్మం), అంబాల రంజిత్‌కుమార్‌ (వీసీపీఈ బొల్లికుంట), గుగులోత్‌ లక్‌పతి టి.ఆకాష్‌ (యూసీపీఈ కేయూ, వరంగల్‌), ఎం.పవన్‌కల్యాణ్‌ ఎల్‌బీ కళాశాల, వరంగల్‌) జట్టులో ఉన్నారు.

Advertisement
Advertisement