‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం

Published Sun, Nov 12 2023 1:12 AM

సమావేశంలో మాట్లాడుతున్న భిక్షపతి - Sakshi

ములుగు రూరల్‌: పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ ముంజాల భిక్షపతిగౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులతో ఆయన శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తరుణంలో సీఎం కేసీఆర్‌ పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటనలు చేసి ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఐదేళ్లు గడిచినా పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పలువురు కూలీలు కూలినాలి చేసుకొని జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలు ఇంటి అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో పాటు, మంత్రులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గంలో నిరుపేదలకు ఇంటి స్థలాలతో పాటు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి ఇచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి గుండబోయిన చంద్రయ్య, సాంబయ్య, సారంగం, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement