వనదేవతలకు ఎన్నికల అధికారుల పూజలు | Sakshi
Sakshi News home page

వనదేవతలకు ఎన్నికల అధికారుల పూజలు

Published Tue, Nov 14 2023 1:16 AM

- - Sakshi

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: వనదేవతలైన మేడారం సమ్మక్క–సారలమ్మలను నియోజకవర్గ పోలీస్‌ ఎన్నికల అబ్జర్వర్‌ పశ్చిమ బెంగాల్‌ ఐపీఎస్‌ అధికారి అంజన్‌ చక్రవర్తి, రెవెన్యూ ఎన్నికల అబ్జర్వన్‌ జార్ఖండ్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి వీకే సింగ్‌లు సోమవారం దర్శించుకున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక అబ్జర్వర్లుగా నియమితులైన వీరు అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. వీరికి పూజారులు దగ్గరుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వారి వెంట పస్రా సీఐ శంకర్‌, తాడ్వాయి ఎస్సై ఓంకార్‌ యాదవ్‌, సిబ్బంది ఉన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారం

ములుగు రూరల్‌: స్పందన ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురు స్పందన అవార్డు–2023 కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ములుగు మండల పరిధిలోని ఇద్దరు ఉపాధ్యాయులు జెడ్పీహెచ్‌ఎస్‌ పత్తిపల్లి ఉపాధ్యాయుడు నర్సింహచారి, బరిగిలానిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కొత్తపల్లి పోషన్నలు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం ఖమ్మంలో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు అవార్డులు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ఉపాధ్యాయులు చేసిన సేవలను కొనియాడుతూ పురస్కారం అందిస్తున్న స్పందన ఫౌండేషన్‌ నిర్వాహకులు సామ్యూల్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

‘ఇసుర్రాయి’కి

అంతర్జాతీయ గుర్తింపు

వాజేడు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడుగా పనిచేస్తున్న రచయిత, డాక్టర్‌ అమ్మిన శ్రీని వాస రాజు రాసిన బాలల కథ ఇసుర్రాయికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. శ్రమ విలువను వర్ణిస్తూ పిల్లల మనస్తత్వాలకు, ఆలోచన విధానాలకు అన్వయించి రాసిన ఈ కథ గతంలో కేంద్ర సాహిత్య అకాడమి, తెలు గు బాలల కథల పుస్తకంలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం కడపకు చెందిన జాని తక్కెడలశిల ఇసుర్రాయి కథను ఏ హ్యాండ్‌ మిల్‌ పేరుతో ఇంగ్లిష్‌లోకి అనువదించారు. దీంతో పాటు మరో 19 కథలు గల పుస్తకం టైని ట్రేజర్స్‌ పేరుతో అంతర్జాతీయ సంస్థ ప్రచురించినట్లు శ్రీనివాసరాజు తెలిపారు. ఒక మారుమూల గ్రామానికి చెందిన రచయిత రాసిన కథ 119 దేశాల్లో స్థానం పొందటం అరుదైన విషయంగా చెప్పారు. 2010–2015 విద్యా సంవత్సరాల మధ్య తను రచించిన అడవిలో అందాల పోటీ అనే కథను మహారాష్ట్ర ప్రభుత్వం ఏడవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement