Sakshi News home page

భక్తిశ్రద్ధలతో నాగులచవితి

Published Sat, Nov 18 2023 1:26 AM

పుట్టలో పాలు పోస్తున్న భక్తులు - Sakshi

మంగపేట: నాగుల చవితిని శుక్రవారం భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మహిళలు పుట్టల్లో పాలుపోసి పూజలు చేసి మొక్కులు చెల్లించారు. మండల పరిధిలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపురం శ్రీ నాగులమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి (నాగులమ్మ ఉపాసకుడు) బాడిష రామకృష్ణ, పూజారి బాడిష నాగరమేష్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ సమీపంలోని నాగులమ్మ పుట్ట వద్ద మహిళలు పూజలు చేసి పాలుపోశారు. పుట్ట వద్ద కోడిగుడ్లు, వివిధ రకాల పిండి వంటలు, పండ్లు నైవేధ్యంగా సమర్పించారు. అదే విదంగా తిమ్మంపేట, మల్లూరు, చెరుపల్లి, బోరునర్సాపురం తదితర గ్రామాల్లో మహిళలు గ్రామాలకు సమీపంలోని నాగులమ్మ పుట్ట వద్దకు వెళ్లి పూజలు చేసి పుట్టలో పాలుపోశారు.

Advertisement

What’s your opinion

Advertisement